kathi mahesh: బాలయ్యను నేనెప్పుడూ తిట్టలేదు: కత్తి మహేష్

  • అభిమానులను బాలయ్య కొట్టడం మంచిది కాదని మాత్రమే అన్నాను
  • నేనన్న దాంట్లో తప్పేముంది
  • నేను ఎవర్నీ తిట్టను

తాను బాలకృష్ణను ఎన్నడూ తిట్టలేదని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన తన అభిమానులపై చేయి చేసుకుంటున్నారని... అలా జరగకూడదని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ఒక పెద్ద సినీ స్టార్, ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తి అలా కొట్టడం మంచిది కాదని, అలాంటి భాషను ఉపయోగించడం మంచిది కాదని మాత్రమే తాను అన్నానని... అందులో తప్పేముందని ప్రశ్నించారు.

టీవీ9లో జరిగిన చర్చా కార్యక్రమానికి కత్తి మహేష్ తో పాటు, నిర్మాత రాంకీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఉంటూ, సినీ రంగంలోని వారందరినీ మహేష్ తిడుతున్నారంటూ కామెంట్ చేశారు. దీనికి సమాధానంగా కత్తి మహేష్ పైవిధంగా స్పందించారు. తాను ఎవర్నీ తిట్టనని, తానొక విమర్శకుడిని మాత్రమేనని చెప్పారు. 

kathi mahesh
ramky
balakrishna
  • Loading...

More Telugu News