free calls: ఆదివారం ఉచిత కాల్స్ చేసుకునే స‌దుపాయాన్ని నిలిపివేయ‌నున్న బీఎస్ఎన్ఎల్‌

  • ఫిబ్ర‌వరి 1, 2018 నుంచి అమ‌లు
  • 2016లో ఈ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన బీఎస్ఎన్‌ల్‌
  • రాత్రి పూట ఫ్రీకాల్స్ స‌మయాన్ని కూడా తగ్గించిన సంస్థ‌

ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి ఆదివారం త‌మ ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల‌కు కల్పిస్తున్న ఉచిత కాల్స్ చేసుకునే స‌దుపాయాన్ని త్వ‌ర‌లో నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 1, 2018 నుంచి ఈ స‌దుపాయాన్ని బీఎస్ఎన్ఎల్‌ నిలిపివేయ‌నుంది. 2016 ఆగ‌స్టులో ఫ్రీడం ఆఫ‌ర్ పేరుతో ఈ స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ స‌దుపాయంతో ప్ర‌తి ఆదివారం నాడు ఏ నెట్‌వ‌ర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవ‌చ్చు.

అంతేకాకుండా సాధార‌ణ రోజుల్లో రాత్రిపూట ఉచిత కాల్స్ స‌మ‌యాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ తగ్గించింది. ఇప్ప‌టివ‌రకు రాత్రి 9 గం.ల నుంచి ఉద‌యం 7 గం.ల వ‌ర‌కు ఉచిత కాల్స్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ స‌మయాన్ని రాత్రి 10.30.గం.ల నుంచి ఉద‌యం 6 గం.లకు త‌గ్గించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News