ram gopal varma: 'జీఎస్టీ సినిమా కథ నాదే' అంటున్న జయకుమార్.. లైట్ తీసుకున్న వర్మ!

  • వివాదంలో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' కథ
  • వర్మపై కోర్టుకు వెళతానన్న రచయిత
  • జయకుమార్ జోకర్ అన్న వర్మ

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ఫిల్మ్ ట్రైలర్ సంచలనం రేకెత్తించింది. అయితే, ఈ చిత్రం ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా స్క్రిప్ట్ తనదే అంటూ రచయిత జయకుమార్ వాదిస్తున్నాడు.

సమీక్ష కోసం తాను స్క్రిప్ట్ ను వర్మకు ఇచ్చానని... అయితే, తన అనుమతి లేకుండానే స్క్రిప్ట్ ను యథాతథంగా వర్మ తెరకెక్కించాడని చెప్పాడు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని... న్యాయం కోసం తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపాడు. అంతే కాదు, 16 పేజీల స్క్రిప్ట్ ను ఇంటర్నెట్లో పెట్టాడు. ఈ ఆరోపణలను వర్మ లైట్ గా తీసుకున్నాడు. జయకుమార్ అనే వ్యక్తి ఓ జోకర్ అంటూ తీసి పారేశాడు. కథను కాపీ చేయాల్సినంత అవసరం తనకు లేదని చెప్పాడు. 

ram gopal varma
god S*x and truth
  • Loading...

More Telugu News