Virat Kohli: విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట!

  • ఐసీసీ క్రికెటర్, ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డులు
  • ఐసీసీ టెస్ట్, వన్డే కెప్టెన్ గా ఎంపిక
  • చాహల్ కు టీ20 పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన అవార్డుల్లో పలు అవార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. గత ఏడాదికి గాను ప్రకటించిన ఈ అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఇఫ్ ది ఇయర్ అవార్డులతో పాటు ఐసీసీ టెస్ట్ కెప్టెన్, ఐసీసీ వన్డే కెప్టెన్ గా కూడా కోహ్లీ ఎంపికయ్యాడు. ఐసీసీ విడుదల చేసిన అవార్డులను కోహ్లీ స్వీప్ చేశాడంటూ బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

మరోవైపు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకున్నాడు. ఐసీసీ టీ20 పర్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇండియా యువ స్పిన్నర్ చాహల్ దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పాక్ క్రికెటర్ హసన్ అలీ గెలుచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందిన పాకిస్థాన్ జట్టు ఐసీసీ ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.

Virat Kohli
icc awards
icc 2017 awards
  • Loading...

More Telugu News