Anushka Shetty: ప్రభాస్ ను అన్నయ్యగా భావించలేను: అనుష్క కీలక వ్యాఖ్య

  • ప్రభాస్, అనుష్కల మధ్య లవ్ నడుస్తోందని రూమర్లు
  • అందరు అబ్బాయిలనూ సోదరులుగా భావించలేము కదా?
  • ప్రభాస్ ను అన్నగా ఫీల్ కాలేనన్న అనుష్క
  • మంచి అబ్బాయిని వెతికి పెడితే, పెళ్లి చేసుకుంటానన్న 'భాగమతి'

గత కొంతకాలంగా ప్రభాస్ కు, అనుష్కకూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలను ఇద్దరూ ఖండించినప్పటికీ, రూమర్స్ మాత్రం ఆగలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రభాస్ ను నేను అన్నయ్యా అని పిలవలేను. అందరు అబ్బాయిలనూ సోదరులుగా భావించలేము కదా? నా గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలియదు. నేనసలు వార్తా పత్రికలు చదవను.

ఇక పెళ్లి గురించి ఆలోచించడమైతే మానేశాను. నా కోసం ఓ మంచి అబ్బాయిని వెతికితే చేసుకుంటా. ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సమయం వచ్చినప్పుడు వాటంతట అవే జరిగిపోతుంటాయి" అని వ్యాఖ్యానించింది. బాహుబలి తరువాత విశ్రాంతి కావాలనే తక్కువ సినిమాలు చేశానని 'భాగమతి' ప్రమోషన్ లో ఆమె చెప్పుకొచ్చింది. మరోసారి రాజమౌళితో పని చేయాలని తనకుందని వ్యాఖ్యానించింది.

Anushka Shetty
Prabhas
Bhagamati
Rajamouli
Brother
  • Loading...

More Telugu News