Donald Trump: ట్రంప్ ప్రకటించిన ఫేక్ న్యూస్ విజేతలు వీరే!

  • తొలి నుంచి మీడియాపై మండిపడుతున్న ట్రంప్
  • తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారంటూ ఆగ్రహం
  • తాజాగా ఫేక్ న్యూస్ అవార్డుల ప్రకటన

తొలి నుంచి కూడా అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలతో తనను బదనాం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పారు. తాజాగా, ఆయన ఫేక్ న్యూస్ అవార్డులను ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక 'ద న్యూయార్క్ టైమ్స్' కు బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు.

దీంతో పాటు సీఎన్ఎన్, ఏబీపీ న్యూస్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఈ వివరాలను జీవోపీ.కామ్ లో పొందుపరిచారు. దీని గురించి ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే ఆ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. జర్నలిజం రంగంలో తాను గౌరవించే గొప్ప జర్నలిస్టులు ఉన్నారని... కానీ మీడియా మాత్రం అవినీతి, కపటబుద్ధితో తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మరో ట్వీట్ లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ కు ఆగ్రహం తెప్పించిన మీడియా కథనాలు ఇవే
...
ద న్యూయార్క్ టైమ్స్: దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు
ఏబీపీ న్యూస్: తప్పుడు కథనాలతో మార్కెట్ ను దెబ్బతీసిన కథనం
సీఎన్ఎన్: వికీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్ కు, ఆయన కుమరుడికి ఉందంటూ కథనం
టైమ్: ఓవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధ విగ్రహాన్ని తొలగించారనే కథనం
ద వాషింగ్టన్ పోస్ట్: ఫ్లోరిడాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీలో జనాలే లేరంటూ కథనం 

Donald Trump
trump fake news awards
  • Loading...

More Telugu News