Hyderabad: హైదరాబాద్‌ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం!

  • బండ్లగూడ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
  • అంటుకున్న అగర్వాల్ రబ్బర్ కంపెనీ
  • ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం

హైదరాబాద్‌ బండ్లగూడలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బండ్లగూడలోని అగర్వాల్ రబ్బర్ కంపెనీ గోడౌన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

రబ్బరు అంటుకోవడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నారు.  

Hyderabad
Bandlaguda
Fire Accident
  • Loading...

More Telugu News