Leonia Resorts: లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజు అరెస్ట్!
- అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు
- బ్యాంకు నుంచి రూ. 432 కోట్ల రుణం
- తప్పుడు పత్రాలను తనఖా పెట్టిన చక్రవర్తి రాజు
హైదరాబాద్ శివార్లలో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తిరాజును కర్ణాటక సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని వెళ్లడం సంచలనాన్ని కలిగించింది. ఆయన కర్ణాటకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ. 432.22 కోట్లను రుణంగా తీసుకున్నారు. ఆపై బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో పాటు, వడ్డీని కూడా కట్టకపోవడం, ఎన్నిసార్లు ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు అధికారులు సంప్రదించాలని చూసినా ఆయన అందుబాటులో లేకపోవడంతో, బ్యాంకు సీబీఐని ఆశ్రయించింది.
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ, మార్చి 2015లో కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆయన డబ్బు తీసుకున్నట్టు తేల్చింది. తదుపరి విచారణ నిమిత్తం చక్రవర్తిరాజును అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంటూ, ఆయన్ను బెంగళూరు తరలించింది.