RGV: వదిలేయమన్న వర్మ.. కుదరదన్న కత్తి!

  • పవన్ అభిమానులతో వివాదాన్ని వదిలేయమన్న వర్మ
  • ఇంత దూరం వచ్చాక ఆ ప్రసక్తే లేదన్న కత్తి
  • తాడోపేడో తేల్చుకునేందుకే సై అన్న సినీ విమర్శకుడు

పవన్ అభిమానులతో వివాదం ఇంత దూరం వచ్చాక ఇక ఆపే ప్రసక్తే లేదని సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ తేల్చి చెప్పాడు. వివాదాన్ని ఆపేయాలంటూ వర్మ ఇచ్చిన సలహాపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘జీఎస్టీ’ షార్ట్‌ఫిల్మ్‌పై ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ, కత్తి మహేశ్ పాల్గొన్నారు.

కత్తి మహేశ్-పవన్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం ఎలా సమసిపోతుందని వర్మని ప్రశ్నించగా.. వివాదం ఆగాలంటే మహేశ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని వర్మ సూచించాడు. వర్మ సలహా కత్తికి ఏమాత్రం రుచించలేదు. ఆ వెంటనే ఆయన స్పందిస్తూ వివాదం  ఇంత దూరం వచ్చాక ఇక వదిలే ప్రసక్తే లేదని, తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు.

RGV
Kathi Mahesh
Pawan Kalyan
  • Loading...

More Telugu News