Bharath Reddy: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కరీంనగర్ టెకీ దుర్మరణం!

  • ట్రయథ్లాన్ పోటీల్లో ప్రమాదం
  • భరత్‌రెడ్డిని ఢీకొన్న ట్రక్కు.. ఆసుపత్రిలో మృతి
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం పాలయ్యాడు. కరీంనగర్‌కు చెందిన భరత్‌రెడ్డి నరహరి (37) సౌత్ ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన లక్ష్మారెడ్డి కుమారుడే భరత్‌రెడ్డి. సైక్లిస్ట్ అయిన ఆయన అమెరికా అథ్లెటిక్స్‌ పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ఐరన్‌మ్యాన్‌’ అవార్డు సాధించాలనే తపనతో గత పదేళ్లుగా సాధన చేస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం మియామీ డేడ్‌లో జరిగిన ట్రయథ్లాన్ పోటీలో పాల్గొన్నాడు. మరికొద్ది సేపట్లో పోటీ ముగుస్తుందనగా ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు ఆయనను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ భరత్ రెడ్డి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో సైక్లిస్ట్ కూడా గాయపడ్డాడు. భరత్‌రెడ్డి మృతిపై టీం హామర్ హెడ్స్ మేనేజ్‌మెంట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bharath Reddy
America
Accident
Telangana
  • Loading...

More Telugu News