babu mohan: గ్రామ అభివృద్ధికి బాబూమెహన్ అడ్డుప‌డుతున్నారంటూ ర్యాలీ!

  • సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌-జోగిపేటలో నిరసన
  • నగరపంచాయతీ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆందోళన
  • బాబూ మోహన్ తన తీరు మార్చుకోవడంలేదని ఆగ్రహం
  • అడ్డుకున్న పనుల లిస్టును తయారు చేసి ప్రజలకు పంచిన వైనం 

సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌-జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే బాబూమోహన్‌కు వ్య‌తిరేకంగా ర్యాలీ నిర్వ‌హించారు. త‌మ నగర పంచాయతీ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నార‌ని ఛైర్‌పర్సన్‌ కవిత సురేందర్‌ గౌడ్ ఆరోపించారు. నగర పంచాయతీలో రూ.7 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటికే ఖరారు అయినప్పటికీ బాబూమోహన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు.

ఈ విషయమై తాము ఇప్పటికే బూబూ మోహన్‌ను కలిసి వివరించి చెప్పామని, అయినప్పటికీ ఆయన తన తీరును మార్చుకోలేదని అన్నారు. నగర పంచాయతీలో బాబూమోహన్ అడ్డుకున్న పనుల లిస్టుని తయారు చేసి, పాలకవర్గం సభ్యులు ప్రజలకు పంచారు.

babu mohan
TRS
sangareddy
  • Loading...

More Telugu News