gst: రేప‌టి జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో కీలక నిర్ణ‌యాలు... రియ‌ల్ఎస్టేట్ జీఎస్టీ ప‌రిధిలోకి?

  • 12 శాతం శ్లాబులోకి రియ‌ల్ఎస్టేట్‌
  • దాదాపు 80 వ‌స్తువుల‌పై ప‌న్ను శ్లాబు త‌గ్గించే అవ‌కాశం
  • జీఎస్టీ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేసే అంశంపై చ‌ర్చ‌

గ‌త రెండు నెల‌ల్లో జీఎస్టీ వ‌సూళ్లు త‌గ్గిపోయిన నేప‌థ్యంలో రేపు జ‌ర‌గ‌బోయే 24వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం కీల‌కంగా మార‌నుంది. అంతేకాకుండా ఈ స‌మావేశంలో రియ‌ల్ ఎస్టేట్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చే అంశాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. దీన్ని 12 శాతం శ్లాబులో చేర్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలాగే మ‌రో 80 వ‌స్తువుల‌పై పన్ను శ్లాబుల‌ను త‌గ్గించే యోచ‌న‌ ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. మరోవైపు జీఎస్టీ రిటర్నుల ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గత సమావేశాల్లో 28శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు. ప్రస్తుతం 50 వస్తువులు మాత్రమే 28శాతం శ్లాబులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News