Nara Lokesh: 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం.. నాలుగు ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం: నారా లోకేశ్

  • మంగళగిరిలో 16 ఐటీ కంపెనీల ప్రారంభం
  • ఏపీకి ఇన్ని ఐటీ కంపెనీలొస్తాయని ఎవరూ ఊహించలేదు
  • మన రాష్ట్రంలో చాకు లాంటి యువత ఉంది: లోకేశ్

2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అమరావతి, విశాఖపట్టణం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నాలుగు ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు 16 ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని ఐటీ కంపెనీలు వస్తాయని నాడు ఎవరూ ఊహించలేదని అన్నారు.

‘ఏపీకి ఐటీ కంపెనీలు ఎందుకు రావాలి? అక్కడ ఏముంది?’ అని నాడు కొందరు ప్రశ్నిస్తే..‘ ఏపీలో చాకు లాంటి యువత ఉంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలని వారు అంటారు’ అని చెప్పానని అన్నారు. అమరావతి రాజధానిగా విజయవంతం కావాలంటే యువతకి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలని, రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News