Defence Minister: ఫైటర్ జెట్ సుఖోయ్‌లో విహ‌రించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

  • ఇటీవలే ఇండియ‌న్ నేవ‌ల్ షిప్ విక్ర‌మాదిత్య‌లో విహ‌రించిన నిర్మలా సీతారామన్‌
  • ప్ర‌త్యేక జీ సూట్‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఉండే హెల్మెట్‌ ధ‌రించిన రక్షణ మంత్రి
  • గతంలో సుఖోయ్‌లో విహ‌రించిన అబ్దుల్ కలామ్, ప్ర‌తిభా పాటిల్

గతంలో భారత మాజీ రాష్ట్ర‌ప‌తులు అబ్దుల్ కలామ్, ప్ర‌తిభా పాటిల్  ఫైటర్ జెట్ సుఖోయ్‌లో విహ‌రించిన విషయం తెలిసిందే. ఈ రోజు  భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఫైటర్ జెట్ సూఖోయ్-30 ఎంకేఐలో విహరించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్పటి నుంచి నిర్మలా సీతారామన్... త్రివిధ ద‌ళాల ఆప‌రేష‌న్స్ ను సమీక్షిస్తున్నారు. ఇటీవలే ఆమె ఇండియ‌న్ నేవ‌ల్ షిప్ విక్ర‌మాదిత్య‌లో విహ‌రించిన విషయం తెలిసిందే. తాజాగా సుఖోయ్‌లో విహరించడం కోసం ప్ర‌త్యేక జీ సూట్‌ను ధరించి, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఉండే హెల్మెట్‌ను ధ‌రించి ఇలా విహరించారు.  

Defence Minister
Nirmala Sitharaman
Sukhoi-30 MKI.
  • Error fetching data: Network response was not ok

More Telugu News