cartosat: కార్టోశాట్-2 శాటిలైట్ పంపిన తొలి చిత్రాన్ని విడుదల చేసిన ఇస్రో
- జనవరి 12న పంపిన శాటిలైట్
- స్పష్టంగా కనిపిస్తున్న ఇండోర్, హోల్కర్ స్టేడియం
- కార్టోగ్రఫీలో ఉపయోగం
ఇటీవల భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి పంపిన కార్టోశాట్-2 శాటిలైట్ కొన్ని చిత్రాలను భూమి మీదకి పంపింది. ఈ ఉపగ్రహం పంపిన తొలి చిత్రాలను ఇస్రో తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియాన్ని ఈ చిత్రాల్లో చూడొచ్చు. కార్టోశాట్ - 2 పంపిన చిత్రం చాలా స్పష్టంగా ఉంది. దీని సహాయంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్, రిసోర్స్ ప్లానింగ్ వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కార్టోగ్రఫీ ద్వారా ఈ శాటిలైట్ పంపిన చిత్రాలను విశ్లేషించి నగరాలను అభివృద్ధి చేయవచ్చు.
జనవరి 12వ తేదీన పీఎస్ఎల్వీ సీ40 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించారు. ఇదే రాకెట్ ద్వారా మరో 28 విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.