pope francis: లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న పోప్ ఫ్రాన్సిస్!
- మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను కలిసిన పోప్
- వారి కష్టాలు, సమస్యలు విని కంటతడి
- చిలీలో జరిగిన సమావేశం
చిలీ దేశంలో క్రైస్తవ మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన కొంతమంది చిన్నారులను పోప్ ఫ్రాన్సిస్ కలిసినట్లు వాటికన్ ప్రతినిధులు వెల్లడించారు. పోప్, చిన్నారుల మధ్య మాత్రమే జరిగిన ఈ సమావేశంలో పిల్లల బాధలను, సమస్యలను విని పోప్ ఫ్రాన్సిస్ కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోప్ ప్రార్థనలు కూడా చేసినట్లు వాటికన్ ప్రతినిధి గ్రెగ్ బర్క్ తెలిపారు.
బాధితులు తమ కష్టాలను మనసు విప్పి పోప్‌తో చెప్పుకునే సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని చాలా కట్టుదిట్టంగా నిర్వహించినట్లు గ్రెగ్ పేర్కొన్నారు. చిలీలోని రోమన్ కేథలిక్ చర్చిలో పనిచేసే మతాధికారులు చేసిన నికృష్ట చర్యలు సిగ్గుచేటని, అందుకు గాను పోప్ ఫ్రాన్సిస్ బాధిత చిన్నారులను క్షమాపణలు కూడా అడిగినట్లు గ్రెగ్ వెల్లడించారు.