Vangaveeti radha: ముహూర్తం ఖరారు... చంద్రబాబు దావోస్ నుంచి రాగానే వంగవీటి రాధ చేరిక!

  • రాధ చేరిక సందర్భంగా బహిరంగ సభ
  • మరింత మంది నేతలు టీడీపీలోకి
  • వెల్లడించిన ఏపీ టీడీపీ సీనీయర్ నేత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయిందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనుండగా, ఆయన అక్కడి నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని, ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 ఇంకా విషయం అధికారికంగా వెల్లడి కానందున, తన పేరును తెలిపేందుకు ఇష్టపడని ఆయన, వైకాపా నుంచి మరింత మంది నేతలు టీడీపీలోకి రానున్నారని, జగన్ వైఖరితో వారంతా విసిగిపోయి ఉన్నారని అన్నారు. రాధ చేరికతో కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింతగా బలపడుతుందని, ఆయనతో పాటు చాలా మంది స్థానిక నేతలు పార్టీ మారనున్నారని తెలిపారు.

Vangaveeti radha
Telugudesam
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News