Kamal Haasan: తన పార్టీపై క్లారిటీ ఇస్తూ ప్రజలకు కమలహాసన్ బహిరంగ లేఖ!

  • వచ్చే నెల నుంచి ప్రజల్లోకి
  • పుట్టిన ఊరు నుంచి యాత్ర మొదలు
  • ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే
  • సంక్షేమ పాలన తీసుకువస్తానన్న కమల్

తమిళనాడు రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న కమలహాసన్, తన పార్టీపై పూర్తి స్పష్టతను ఇస్తూ, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఫిబ్రవరి 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతుందని అన్నారు.

 తాను పుట్టిన రామనాథపురం నుంచి యాత్ర మొదలవుతుందని, మధురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో తొలి విడత పాదయాత్ర ఉంటుందని తెలిపారు. తనపై ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే పాలిటిక్స్ లోకి వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తోందని, ప్రజా సంక్షేమ పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని కమల్ తెలిపారు. తన యాత్రకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

Kamal Haasan
Tamilnadu
Politicle Party
  • Loading...

More Telugu News