Pawan Kalyan: నో డౌట్! పవన్‌పై కచ్చితంగా పోటీ చేస్తా: స్పష్టం చేసిన కత్తి మహేశ్

  • ప్రజాస్వామ్యానికి పవన్ వ్యతిరేకి
  • ఆయనను ప్రజాస్వామ్య బద్ధంగానే ఓడించాలి
  • పవన్‌పై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా

పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రకటించాడు. పవన్ ఫ్యాన్స్ తనపై ఇలాగే దాడి చేయడం కొనసాగిస్తే పవన్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి వెనుకంజ వేయబోనని స్పష్టం చేశాడు. పవన్ అభిమానులతో కొనసాగుతున్న వివాదంపై ఓ చానల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కత్తి మాట్లాడుతూ.. అభిమానులను పవన్ రెచ్చగొడుతున్నారని, ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాడని తేల్చి చెప్పాడు.

పవన్ లాంటి వ్యక్తిపై ప్రజాస్వామ్యయుతంగానే పోరాడాలని, అలాగే ఓడించాలని కత్తి మహేశ్ పేర్కొన్నాడు. తాను సామాన్యమైన వ్యక్తినని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు ఉందని స్పష్టం చేశాడు. పవన్ ఫ్యాన్స్ బానిస మనస్తత్వంతో బతికేస్తున్నారని తనకు అనిపిస్తోందని పేర్కొన్న కత్తి, నాలుగు నెలలుగా తాను తన హక్కుల కోసం, వ్యక్తిత్వం కోసం, అస్థిత్వం కోసం పోరాడుతుంటే వీళ్లకు ఎందుకు అర్థం కావడం లేదో తనకు అర్థం కావడం లేదని కత్తి మహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Pawan Kalyan
Kathi Mahesh
Election
Andhra Pradesh
  • Loading...

More Telugu News