Kathi Mahesh: ఈ గొడవ ఆగాలంటే పవన్ కల్యాణ్‌ ఫొటోకి దండం పెట్టి.. క్షమాపణలు చెప్పి టీవీ9 స్టూడియో నుంచి నువ్వు వెళ్లిపో!: మహేశ్ కత్తికి జనసేన నేత రాజారెడ్డి సలహా

  • నేను చేసిన ఆరోపణలకు ఆధారాలను పవన్ కల్యాణ్ అడిగితే చూపిస్తాను-మహేశ్ కత్తి
  • నేను మర్యాదగా ఈ వివాదానికి తెరవేయాలని వచ్చాను
  • మీరు ఇలాగే మాట్లాడితే రేపటి నుంచి మళ్లీ పవన్ కల్యాణ్‌పై కౌంటర్లు ఇస్తాను
  • నువ్వు ఎవరివయ్యా అసలు?- జనసేన నేత రాజారెడ్డి 

సినీనటుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేశ్ క‌త్తి మ‌రోసారి విరుచుకుపడ్డారు. రాజీకి పవన్ అభిమానులు ప్రయత్నించడం లేదని అన్నారు. ఈ రోజు టీవీ9 స్టూడియోలో పవన్ కల్యాణ్ అభిమానులతో, జనసేన నేతలతో చర్చకు వచ్చిన మహేశ్ కత్తి మాట్లాడుతూ, వారు కొన్ని రోజులుగా అడుగుతోన్న 7 ప్రశ్నలకు మహేశ్ కత్తి సమాధానాలు చెప్పిన విషయం తెలిసిందే.

ఆ సమాధానాలపై స్పందించిన జనసేన నేత రాజారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్ కత్తి చెప్పిన సమాధానాలు ఎలా ఉన్నాయంటే, దొంగని పోలీసులు పట్టుకెళితే పోలీసులకి దొంగ రకరకాల కథలు చెబుతాడు.. అటువంటి కథలనే మహేశ్ కత్తి చెప్పాడు.. ఏ ఆధారాలు ఉన్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు?' అని అడిగారు.

దీంతో మహేశ్ కత్తి మాట్లాడుతూ... 'ఈ విషయం పవన్ కల్యాణ్ అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని ఆధారాలను చూపిస్తా.. మహేశ్ కత్తి ఫ్యామిలీ ఏంటో నువ్వు కనుక్కుని మాట్లాడు. నేను మర్యాదగా ఈ వివాదానికి తెరవేయాలని వచ్చాను. మీరు ఇలాగే మాట్లాడితే రేపటి నుంచి మళ్లీ పవన్ కల్యాణ్‌పై కౌంటర్లు ఇస్తాను' అని వ్యాఖ్యానించారు.

దీంతో రాజారెడ్డి మాట్లాడుతూ.. 'నువ్వు ఎవరివయ్యా అసలు? ఎవరు నువ్వు? నువ్వు ఈ గొడవను ఆపాలనుకుంటే టీవీ9 స్టూడియోలో ఈ క్షణం పవన్ కల్యాణ్ ఫొటోని పట్టుకుని ఆయన కాళ్లకి దండం పెట్టుకుని స్టూడియో నుంచి వెళ్లిపో' అని వ్యాఖ్యానించారు. 

Kathi Mahesh
Pawan Kalyan
  • Loading...

More Telugu News