chief justice of india: మెడికల్ కాలేజీ స్కాంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాత్ర ఉంది: ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
- భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు
- సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరగాలి
- ప్రశాంత్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కిన వాతావరణం
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పాత్ర ఉందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరగాలని అన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జస్టిస్ చలమేశ్వర్ చేసిన ఆరోపణలకు కూడా ప్రశాంత్ భూషణ్ మద్దతు పలికారు. తాజాగా ఈయన చేసిన ఆరోపణలతో మరింత వేడి రాజుకుంది.