Kaira Dutt: అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చానని అమ్మా నాన్నలకు తెలుసు: అందాల భామ కైరా దత్

  • 15వ ఏటనే మోడలింగ్ కోసం ముంబై వచ్చాను
  • తల్లిదండ్రులు ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు
  • వరుసగా ఆఫర్లు వస్తున్నాయన్న కైరా

అన్నింటికీ సిద్ధమైతేనే సినిమా రంగంలోకి వెళ్లాల్సి ఉంటుందన్న సంగతి తన తల్లిదండ్రులకు తెలుసునని, అందుకే తెరపై అందాలను ఆరబోసినా, ఐటమ్ సాంగ్స్ చేసినా వారికి ఎటువంటి అభ్యంతరాలూ లేవని హాట్ గర్ల్ కైరా దత్ వ్యాఖ్యానించింది. 'రేసుగుర్రం'తో టాలీవుడ్ లో అడుగుపెట్టి 'పైసా వసూల్' అనిపించిన ఈ భామ, తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, 15వ ఏటనే మోడలింగ్ కోసం ముంబై వచ్చేశానని చెప్పింది.

 'క్యాలెండర్ గర్ల్' చిత్రం తనకు గుర్తింపునివ్వగా, ఎక్కువగా ఐటమ్ సాంగ్సే చేశానని, డ్యాన్సర్ ను కావడంతో అదేమంత పెద్ద కష్టమని అనిపించలేదని చెప్పుకొచ్చింది. అమ్మా నాన్నలకు అన్నీ తెలుసు కాబట్టి, వారు ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదని, ఎక్స్ పోజింగ్ చేసినా రాని గుర్తింపును ఐటమ్ సాంగ్స్ తెచ్చి పెట్టాయని, ఇప్పుడు ఆఫర్లు వరుసగా వస్తున్నాయని చెప్పింది.

టాలీవుడ్ లో భాష సమస్య ఉన్నప్పటికీ, తాను తెలుగు నేర్చుకుంటున్నానని, ఎదుటి వ్యక్తి చెప్పేది అర్థమవుతోందని అంది. సౌత్ ఇండియాలో ఐటమ్ సాంగ్స్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో తెలియదని, నిర్మాతలు ఇచ్చినంత మాత్రమే తీసుకుంటున్నానని చెప్పింది కైరా.

Kaira Dutt
Paisavasool
Item Girl
  • Loading...

More Telugu News