chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. చిన్నల్లుడితో 'చిరు' పోజు... ఫొటోలు చూడండి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-3ee4284188eb5cca5e3cc1ea7c0f3f08686f8cae.jpg)
- చిన్నల్లుడితో చిరు
- ఫొటో వైరల్
- సందడిగా సంక్రాంతి వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా హీరోలంతా ఒకేచోట చేరి సందడి చేశారు. ఈ వేడుకల్లో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సందర్భంగా పంచెకట్టులో ఉన్న చిరంజీవి తన అల్లుడితో దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కాగా, త్వరలోనే కల్యాణ్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. రాకేశ్ శశి దర్శకుడిగా సాయి కొర్రపాటి నిర్మాతగా వారాహి పతాకంపై తెరకెక్కనున్న చిత్రంలో కల్యాణ్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-cabcd0dffbe71a6742570f91c4d5c10566bc4f72.jpg)