Mahesh Babu: మహేష్-కొరటాల చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26న.. ఆసక్తికరంగా పోస్టర్ విడుదల!

  • కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'
  • పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాతలు
  • సీఎంగా ప్రమాణ స్వీకారం మాటలు
  • 26న విడుదల కానున్న ఫస్ట్ లుక్

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'భరత్ అనే నేను' చిత్రం ఫస్ట్ లుక్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నామని చెబుతూ, దానికి సంబంధించిన ఓ పోస్టరును సంక్రాంతి సందర్భంగా డీవీవీ ఎంటర్ టెయిన్ మెంట్స్ విడుదల చేసింది.

లక్షలాది మంది ప్రజలు కనిపిస్తున్న ఫొటోపై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.

ఇందులో మహేష్ బాబు స్క్రీన్ నేమ్ 'భరత్' ఎక్కడా కనిపించకపోయినప్పటికీ, ఈ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu
Bharat anu nenu
new movie
January 26
First Look
  • Error fetching data: Network response was not ok

More Telugu News