pig fight: జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నంతవరకు సైలెంట్ గానే ఉన్నారు.. ఆయన వెళ్లగానే బెట్టింగ్ మొదలెట్టారు!

  • తాడిపత్రిలో పందుల పోటీలు
  • భారీ ఎత్తున బెట్టింగులు
  • కేటగిరీ-1లో పెద్దపప్పూరు పంది గెలుపు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పందుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు ఇరు రాష్ట్రాలకు చెందిన పందులు తరలి వచ్చాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పందులను తీసుకొచ్చారు. గత ఏడాది తాడిపత్రిలో పందులతో పాటు కోడి పందేలు కూడా జరిగాయి. అయితే కోడి పందేలపై నిషేధం ఉండటంతో ఈ ఏడాది వాటి జోలికి పోలేదు.

మరోవైపు పందుల పోటీలను చూసేందుకు ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి వచ్చారు. దాదాపు గంటసేపు పోటీలను ఎంజాయ్ చేశారు. ఆయన ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. ఆయన అక్కడ నుంచి వెళ్లిన మరుక్షణమే... పందెంరాయుళ్లు జూలు విదిలించారు. బెట్టింగులకు తెరలేపారు. భారీ ఎత్తున పందేలు జరిగాయి. మరోవైపు కేటగిరీ-1లో కల్యాణదుర్గం, పెద్దపప్పూరు మండలాలకు చెందిన పందులు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ పోటీలో పెద్దపప్పూరు మండలానికి చెందిన పంది గెలుపొందింది. దీంతో, దాని యజమాని లక్ష రూపాయలను కైవసం చేసుకున్నారు.

pig fight
jc prabhakar reddy
  • Loading...

More Telugu News