Vijayawada: బెజవాడ దుర్గమ్మ అర్చకుడిగా ఇక సుందరశర్మ!
- సుందరశర్మకు బాధ్యతల అప్పగింత
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- గత నెల 26న ఆలయంలో అర్థరాత్రి తాంత్రిక పూజలు
- దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ప్రధానార్చకుడు బదరీనాథ్
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రధాన అర్చకుడిగా సుందరశర్మకు బాధ్యతలు అప్పగిస్తూ, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో ఇటీవల జరిగిన సంఘటనలు, ప్రచారంలో ఉన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఈఓ, ప్రధాన అర్చకులను తప్పించిన ప్రభుత్వం, తాజాగా సుందరశర్మను ముఖ్య అర్చకుడిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది.
గత సంవత్సరం డిసెంబర్ 26న అర్థరాత్రి పూట దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ప్రధాన అర్చకుడు బదరీనాథ్ ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన తాను విధులకు దీర్ఘకాల సెలవు పెట్టి వెళుతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో అంతరాలయంలో నిర్వహించాల్సిన పూజల బాధ్యతలను సుందరశర్మకు అప్పగించారు.