Balakrishna: జోడెద్దుల బండెక్కి చర్నాకోల పట్టి... బాలయ్య సందడి ఇది!

  • వియ్యంకుడి స్వగ్రామంలో బాలయ్య సందడి
  • ఎడ్ల బండి నడుపుతూ వీధుల్లో చక్కర్లు
  • ఆపై తిరుపతిలో 'జై సింహా' చూసిన బాలకృష్ణ

ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలను తన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో జరుపుకుంటున్న హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వినూత్నంగా సందడి చేశారు. పూలు, అరటి బోదెలతో అందంగా అలంకరించిన జోడెద్దుల బండెక్కి, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తూ, నారావారి పల్లె వీధుల్లో చక్కర్లు కొట్టారు.

 గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ, తన అభిమానులకు అభివాదం చేస్తూ సాగారు. ఆపై తిరుపతికి వచ్చి తన కొత్త చిత్రం 'జై సింహా'ను అభిమానులతో కలసి థియేటర్ లో కూర్చుని చూశారు. అతి త్వరలోనే ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Balakrishna
Jai Simha
Naravari Palle
Sankranthi
  • Loading...

More Telugu News