Railway: ప్రయాణికులను బాదేందుకు సిద్ధమైన రైల్వే.. క్లోక్ రూమ్ చార్జీలు పెంచాలని నిర్ణయం

  • త్వరలో  క్లోక్ రూమ్, లాకర్ చార్జీల పంపు
  • సేవలను ఆధునికీకరించనున్న రైల్వే
  • చార్జీలు పెంచాలంటూ డీఆర్ఎం‌లకు ఆదేశాలు

ప్రయాణికులను బాదేందుకు రైల్వే రెడీ అయింది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్లోక్ రూమ్స్, లాకర్ చార్జీలను పెంచాలని రైల్వే బోర్డు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది. చార్జీల పెంపు నిర్ణయాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్‌ (డీఆర్ఎం)లకు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం క్లోక్‌రూమ్, లాకర్ సేవలను ఆధునికీకరించడంతోపాటు కంప్యూటరైజ్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించనున్నారు.

ఇప్పటి వరకు లాకర్‌ను 24 గంటలపాటు వాడుకుంటే రూ.15 వసూలు చేస్తుండగా, ఇప్పుడు రూ.20 వసూలు చేయనున్నారు. అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే రూ.30 వసూలు చేస్తారు. ఇక క్లోక్ రూమ్ రెంట్ ను 24 గంటలకు రూ.15ల చార్జిగా సవరించారు. 2000వ సంవత్సరంలో ఇది ఏడు రూపాయలు ఉండగా అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే 20 వసూలు చేసేవారు. అయితే 2013లో వీటిని సవరించి తొలి 24 గంటలకు రూ. 10 తర్వాతి 24 గంటలకు రూ.15లుగా సవరించారు. తాజా నిర్ణయంతో ఈ చార్జీలకు మరోమారు రెక్కలు రానున్నాయి.

  • Loading...

More Telugu News