Raghunath Jha: కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ కన్నుమూత

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఆయన వయసు 78 సంవత్సరాలు
  • రాజకీయ నాయకుల సంతాపం

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి రఘునాథ్ ఝా ఈ ఉదయం న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆయనకు భార్య దీవ్ కర్నా దేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన్ను కుటుంబీకులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తుండగా, పరిస్థితి విషమించి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

 బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సన్నిహితుడిగా ఉంటూ, బెతయ్యా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన, 2004లో ఏర్పడిన మన్మోహన్ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్, జనతా పార్టీ, జనతాదళ్ (యు)లలో సైతం సేవలందించారు. ఝా మృతిపై సీనియర్ రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Raghunath Jha
RJD
Died
  • Loading...

More Telugu News