Shilpa Shinde: బిగ్‌బాస్ 11 విజేతగా శిల్పా షిండే.. ట్రోఫీని బహూకరించిన సల్మాన్ ఖాన్

  • ఆద్యంతం వినోదాన్ని పంచిన ‘బిగ్‌బాస్’
  • అభిమానుల మద్దతుతో విజేతగా నిలిచిన శిల్ప
  • ఫినాలేకు హాజరైన అక్షయ్ కుమార్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 11’లో శిల్పా షిండే విజేతగా నిలిచింది. అభిమానులు తమ ఓట్లతో శిల్పకు మద్దతు ప్రకటించడంతో ప్రత్యర్థి హీనాఖాన్ ను వెనక్కి నెట్టి ట్రోఫీని  సొంతం చేసుకుంది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన శిల్పా షిండేకు సల్మాన్ ట్రోఫీ అందించాడు.

మహారాష్ట్రలోని లోనావాలాలో 19,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిగ్‌బాస్ హౌస్‌ను ఏర్పాటు చేసి చుట్టూ 90 కెమెరాలు అమర్చారు. ఈ షోకు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆదివారం నిర్వహించిన గ్రాండ్ ఫినాలేకు బాలీవుడ్ మరో హీరో అక్షయ్ కుమార్ అతిథిగా వచ్చాడు.

Shilpa Shinde
Big Boss 11
Salman Khan
Akshay Kumar
  • Loading...

More Telugu News