Lalu prasad Yadav: జైల్లోని లాలూకు సంక్రాంతి స్పెషల్.. ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చిన అనుచరులు!

  • లాలూకి ఎంతో ఇష్టమైన వంటకం ‘దహీ చుర్రా’
  • పండుగ ప్రత్యేక వంటకాన్ని రుచి చూసిన ఆర్జేడీ అధినేత
  • ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించిన అధికారులు

దాణా కుంభకోణంలో అరెస్టై బిర్సాముండా జైలులో ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ సంక్రాంతి పండుగను ఆస్వాదిస్తున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన ‘దహీ చుర్రా’ రుచి చూశారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ వంటకాన్ని అనుచరులు తీసుకొచ్చి జైలులో ఉన్న ఆయనకు అందించారు.

జైల్లోని లాలును ముగ్గురు తప్ప ఎక్కువ మంది కలవడానికి వీల్లేదని ఈనెల 10న సీబీఐ న్యాయమూర్తి ఆదేశించారు. అయితే పండుగ వస్తోందని, కాబట్టి పునరాలోచించాలని న్యాయమూర్తిని లాలు కోరారు. ఆయన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. దీంతో ఆదివారం ‘దహీ చుర్రా’తో ఆయన అనుచరులు పలువురు వచ్చినా కేవలం ముగ్గురిని మాత్రమే అధికారులు లోనికి అనుమతించారు.

Lalu prasad Yadav
Bihar
Jail
Foddar Scam
  • Loading...

More Telugu News