India: టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్.. పోరాడుతున్న కోహ్లీ!

  • తొలి టెస్టు నుంచి పాఠాలు నేర్చుకోని భారత బ్యాట్స్‌మెన్
  • పెవిలియన్‌కు క్యూ.. ఆదుకున్న కోహ్లీ
  • సెంచరీ దిశగా సాగుతున్న కెప్టెన్

సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కష్టాలకు ఎదురీదుతోంది. 164 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి టెస్టులో విఫలమైన కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా సంయమనంతో ఆడుతూ సఫారీల సహనాన్ని  పరీక్షిస్తున్నాడు. 85 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 335 పరుగుల వద్ద ముగిసిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 28 పరుగుల వద్ద లోకేశ్ రాహుల్ (10) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికి అదే స్కోరు వద్ద చటేశ్వర్ పుజారా డకౌట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. మురళీ విజయ్ (46)తో కలిసి  సంయమనంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 107 పరుగుల వద్ద మురళీ విజయ్ (46) అవుటవడంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే రోహిత్  శర్మ (10), పార్థివ్ పటేల్ (19) ఔటయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి ఆతిథ్య జట్టు కంటే 152 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీ (85), హార్థిక్ పాండ్యా (11) నైట్‌వాచ్‌మన్లుగా ఉన్నారు.

అంతకుముందు 269/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్‌కు ముందు 335 పరుగులకు ఆలౌటైంది.  భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4, ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీయగా షమీకి ఓ వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News