nani: అన్నట్టుగానే హీరో నాని ఫస్ట్ లుక్ తో ‘సర్ ప్రైజ్’ ఇచ్చాడు!

  • నాని కొత్త చిత్రం ‘కృష్ణార్జునయుద్ధం’ 
  • ముందుగా చెప్పినట్టు ‘కృష్ణ’ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల
  • ఓ ట్వీట్ చేసిన నాని

భోగి పండగ సందర్భంగా హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, నాగశౌర్యలు తమ కొత్త చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఇప్పటికే షేర్ చేసుకున్నారు. సంక్రాంతి పండగకు సర్ ప్రైజ్ చేస్తానని చెప్పిన నాని, ఆ సర్ ప్రైజ్ ఏంటో బయటపెట్టేశాడు. తన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నాడు.

ఎర్రచొక్కా, లోపల నల్ల బనియన్, లుంగీ ధరించిన నాని మెడలో తాయెత్తుతో సీరియస్ గా పక్కకు చూస్తూ ఈ పోస్టర్ లో కనబడతాడు. భోగి రోజున ‘కృష్ణ’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, సంక్రాంతి రోజున ‘అర్జున్’ పాత్ర ఫస్ట్ లుక్, కనుమ రోజున ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేస్తామని నాని నిన్న ప్రకటించాడు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు... హ్యాపీ భోగి’ అని తన పోస్ట్ లో నాని పేర్కొన్నాడు. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News