Kathi Mahesh: కత్తి మహేశ్ వెనుక నేనున్నానని అనుకుంటున్నారు.. అది అవాస్తవం!: తమ్మారెడ్డి భరద్వాజ

  • కత్తి మహేశ్ వెనుక నేనుండి నడిపిస్తున్నాననేది అబద్ధం
  • అలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు
  • కత్తి మహేశ్ మా ఆఫీసులో కూర్చుంటూ ఉంటాడు
  •  అందుకని, ఆ ఆరోపణలు వచ్చి ఉండొచ్చు: తమ్మారెడ్డి

పవన్ కల్యాణ్ అభిమానులకు, కత్తి మహేశ్ మధ్య వివాదం నెలకొని దాదాపు నాలుగు నెలలు అవుతుంది. ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని, సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలనే విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు ఈ మేరకు విజ్ఞప్తి చేయడం విదితమే.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, కత్తి మహేశ్ వెనుక తాను ఉన్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. కత్తి మహేశ్ వెనుక తానుండి చేయించాల్సిన అవసరం తనకు లేదని, అసలు, ఇది తనకు సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేశారు. కత్తి మహేశ్ తమ ఆఫీసులో కూర్చుంటూ ఉంటాడని, ఈ నేపథ్యంలో తనపై ఇటువంటి వదంతులు వచ్చి ఉంటాయని తాను భావిస్తున్నానని అన్నారు. 

Kathi Mahesh
tammareddy
  • Loading...

More Telugu News