Cricket: అండర్ -19 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

  • మౌంట్ మౌంగానుయ్ లో జరిగిన తొలి మ్యాచ్ 
  • వంద పరుగుల తేడాతో భారత్ విజయం
  • భారత్ స్కోర్ : 328/7 (50 ఓవర్లు)
  • ఆస్ట్రేలియా స్కోర్ : 228/ఆలౌట్ (42.5 ఓవర్లు)

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా మౌంట్ మౌంగానుయ్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై వంద పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 329 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 42.5 ఓవరల్లో 228 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఓపెనర్లు పృధ్వీషా, మనోజ్ కల్రాలు రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 329 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆసీస్ జట్టులో ఎడ్వర్డ్స్ (73) ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ జట్టులో మిగిలిన ఆటగాళ్లెవరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు.

భారత్ స్కోర్ : 328/7

ఆస్ట్రేలియా స్కోర్ : 228/ ఆలౌట్ (42.5 ఓవర్లు)

Cricket
Australia
  • Loading...

More Telugu News