Chandrababu: పంచెకట్టు, భుజాన కండువా... నారా వారి వారసుడు దేవాన్ష్ లేటెస్ట్ వీడియో!

  • ఉదయం తాతయ్యలతో కలసి తిరుమలకు వచ్చిన దేవాన్ష్
  • పంచెకట్టు, లాల్చీ ధరించి బుడిబుడి అడుగులు
  • వైరల్ అవుతున్న వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణల మనవడు, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు లోకేష్, ఈ ఉదయం తన తాత, తండ్రితో కలసి తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం వచ్చిన వేళ, తన ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఓ వైపు ఇద్దరు తాతలు, మరోవైపు తల్లిదండ్రులు నడుస్తుండగా, చిన్న పట్టు పంచె, లాల్చీ కట్టుకుని, భుజాన కండువా వేసుకుని నడిచాడు. కాసేపు తండ్రి చంకలో, ఆపై క్యూ లైన్లలో నడుస్తూ కనిపించాడు. ఆపై ఆలయంలో డాలర్ శేషాద్రి కాసేపు దేవాన్ష్ చేయి పట్టుకుని నడిపించాడు. ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తరువాత, మహాద్వారం వద్ద మీడియా కోసం ఫోటోలు దిగుతున్న వేళ, జారిపోతున్న పంచెను సర్దుకుంటూ కనిపించాడు దేవాన్ష్.

Chandrababu
Tirumala
devansh
Balakrishna
Nara Lokesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News