Chandrababu: చంద్రబాబు ఇలాకాలో జగన్ చేసిన విమర్శలివి!

  • చంద్రగిరి నియోజకవర్గంలో సాగుతున్న జగన్ పాదయాత్ర
  • తన ఊరి అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు
  • వైఎస్ జగన్ ఆరోపణలు

తాను జన్మించిన గడ్డకు చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. తన పాదయాత్రలో భాగంగా చంద్రబాబు ఇలాకా చంద్రగిరిలో కాలినడకన పర్యటిస్తున్న ఆయన, ప్రవాసాంధ్రులు తమ సొంత ఊరికి ఎంతో చేయాలని చూస్తుంటే, చంద్రబాబు మాత్రం తన ఊరికి ఏమీ చేయడం లేదని అన్నారు.

ఆయన చదివిన శేషాపురం పాఠశాల పడిపోయే స్థితికి చేరితే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రగిరిలో 100 పడకల ఆసుపత్రిని దివంగత మహానేత వైఎస్ ప్రారంభిస్తే, దాన్ని ఇప్పటివరకూ అభివృద్ధి చేయలేదని తెలిపారు. నీటికి, పాలకూ ఒకే ధర పలుకుతోందని, దీనికి చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కారణమని నిప్పులు చెరిగారు.

రైతు కుటుంబంలో పుట్టిన ఆయన రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నారని, ఎన్నికలు గుర్తుకు వచ్చిన తరువాతనే ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. తనకు అండగా నిలిస్తే, వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చిన జగన్, రాజకీయ ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.

Chandrababu
YSRCP
Jagan
Prajasankalpa yatra
  • Loading...

More Telugu News