Virat Kohli: ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకుంటున్న కోహ్లీ, అనుష్క... కారణమిదే!

  • ఇటలీలో పెళ్లి చేసుకున్న విరాట్, అనుష్క
  • విదేశంలో పెళ్లి జరగడంతో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారుల నిరాకరణ
  • ఇండియాలో పెళ్లి చేసుకునే ఆలోచనలో విరుష్క!

మొన్నామధ్యే ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకుకుని, ఇండియాలో ఘనంగా విందు కూడా ఇచ్చారుగా? వీరి మధ్య మళ్లీ పెళ్లేంటని అనుకుంటున్నారా? నిజమేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం.

దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న వీరు, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ ఉండగా, అనుష్క ఇటీవలే హనీమూన్ ను ముగించుకుని ముంబై వచ్చేసింది. మరోసారి వివాహంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Virat Kohli
Anushka Sharma
Italy
Marriage
  • Loading...

More Telugu News