India: మీరు యుద్ధానికి కాలుదువ్వితే.. అణుబాంబులేస్తాం!: ఇండియాకు పాక్ హెచ్చరిక

  • ప్రభుత్వం అనుమతిస్తే అణుదాడి చేస్తామన్న బిపిన్ రావత్
  • తీవ్రంగా స్పందించిన పాక్ విదేశాంగ మంత్రి
  • కవ్విస్తే, తాము కూడా అణు బాంబు వేస్తామన్న ఖ్వాజా ఆసిఫ్

ఇండియాపై అణుదాడి తప్పదని కఠిన వ్యాఖ్యలు చేశారు పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ ట్వీట్‌ చేశారు. భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని ఆరోపించిన ఆయన, అణు దాడికి ఇండియా తమకు ఆహ్వానం పంపుతోందని అన్నారు.

యుద్ధానికి కాలుదువ్వితే, తాము కూడా సిద్ధమేనని, భారత్ పై తీవ్ర స్థాయిలో అణు బాంబులు వేయగల సత్తా తమకుందని, ఈ విషయంలో రావత్ కు ఏమైనా అనుమానాలు ఉంటే, అవి త్వరలోనే తీరిపోతాయని అన్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాక్ పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రావత్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ ప్రతినిధి ఫైసల్ కూడా మండిపడ్డాడు. ఆయన మాటలను తేలికగా తీసుకోబోమని అన్నారు.

  • Loading...

More Telugu News