Under 19 Cricket World Cup: రెచ్చిపోతున్న మన కుర్రాళ్లు... ఆస్ట్రేలియాపై భారీ స్కోరు దిశగా ఇండియా అండర్ 19!

  • మౌంట్ మౌంగానుయ్ లో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్
  • ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మ్యాచ్
  • సెంచరీ మిస్ చేసుకున్న కెప్టెన్ పృధ్వీ షా

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా మౌంట్ మౌంగానుయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పోరాడుతున్న భారత కుర్రాళ్లు భారీ స్కోరు దిశగా సాగుతున్నారు. ఓపెనర్లు పృధ్వీ షా, మనోజ్ కల్రాలు చెలరేగి ఆడటంతో 30వ ఓవర్ లోపే ఇండియా 180 పరుగులు దాటింది. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ పృధ్వీ షాను పేస్ బౌలర్ సుదర్లాండ్ పెవీలియన్ కు పంపాడు. బంతిని అంచనా వేయడంలో పొరపడ్డ షా, కీపర్ హోల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగి, సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ మన్ జ్యోత్ 78 పరుగులు చేయగా, అతనికి ఎస్ గిల్ తోడుగా వచ్చాడు. ప్రస్తుతం భారత స్కోరు 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 184 పరుగులు.

Under 19 Cricket World Cup
India
Australia
Pruthvi shaw
  • Loading...

More Telugu News