Kathi Mahesh: ఒక్కసారి క్షమాపణలు చెప్పు... ఆపై ఏమైనా అంటే పవన్ ను నేనే ప్రశ్నిస్తా: కత్తికి నిర్మాత, నటుడు రాంకీ సలహా

  • మాటల యుద్ధానికి తెరదించే ప్రయత్నం చేసిన రాంకీ
  • అభిమానుల ఇగోను దృష్టిలో పెట్టుకోవాలని సూచన
  • సారీ చెప్పినా విమర్శలు వస్తుంటే తానే ప్రశ్నిస్తానన్న రాంకీ

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి తెరదించేలా నటుడు, నిర్మాత రాంకీ, ఓ సలహాను ఇచ్చాడు. ఓ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న రాంకీ, కామెంట్ చేసే ప్రతి వ్యక్తిని పవన్ అభిమానిగా సర్టిఫై చేయడం తగదని, వివాదానికి తెర లేపింది కత్తి మహేష్ కాబట్టి, తొలుత ఆయన క్షమాపణ చెప్పాలని కోరాడు.

తనకు ఇగో ఉందని చెప్పుకున్న కత్తి, లక్షల సంఖ్యలో ఉండే పవన్ అభిమానుల ఇగోనూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాడు. ఒకసారి క్షమాపణలు చెప్పిన తరువాత కూడా ఎవరైనా మహేష్ ని కామెంట్ చేస్తే, సినీ ఇండస్ట్రీతో పాటు ప్రతి ఒక్కరి నుంచీ మద్దతు వస్తుందని అన్నాడు. సారీ చెప్పిన తరువాత కూడా టార్గెట్ చేస్తున్నారన్న సింపతీ కూడా ఆయనకు లభిస్తుందని చెప్పాడు. ముందు క్షమాపణలు కోరాలని, ఆపై కూడా విమర్శలు వస్తుంటే, తానే స్వయంగా పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తానని అన్నాడు. ఇండస్ట్రీ పెద్దల సపోర్టు కూడా వస్తుందని హామీ ఇచ్చాడు. కాగా, రాంకీ సలహాను కత్తి చాలా లైట్ గా తీసుకున్నట్టు ఈ ఇంటర్వ్యూలో కనిపించింది.

Kathi Mahesh
Ramki
Pawan Kalyan
  • Loading...

More Telugu News