Passenger: ఎస్కలేటర్ ఎక్కే క్రమంలో పడిపోయిన దంపతులు.. కాపాడిన వ్యక్తి.. వీడియో!

  • ఓ స‌బ్‌వే స్టేష‌న్‌లో ఎస్క‌లేట‌ర్ ఎక్కుతూ బ్యాలెన్స్ త‌ప్పిన వైనం
  • ఎమ‌ర్జెన్సీ బ‌ట‌న్ నొక్క‌డంతో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ దంపతులు
  • ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు కంగారు పడకూడదని అధికారుల సూచన
  • తూర్పు చైనాలోని షాంగ్హాయిలో ఘటన

ఓ వృద్ధుడు ఓ స‌బ్‌వే స్టేష‌న్‌లో ఎస్క‌లేట‌ర్ ఎక్కుతూ బ్యాలెన్స్ త‌ప్పి పడిపోతుండ‌గా ఆయ‌న భార్య అత‌డిని కాపాడాల‌ని చూసింది. అయితే, చివ‌ర‌కు ఆయ‌న‌తో పాటు ఆమె కూడా కింద ప‌డిపోయింది. స‌మ‌యానికి ఎస్క‌లేట‌ర్‌ను ఆఫ్ చేసి ఓ వ్య‌క్తి వారిద్ద‌రిని కాపాడాడు. ఈ ఘ‌ట‌న తూర్పు చైనాలోని షాంగ్హాయిలో చోటు చేసుకుంది. వారిని కాపాడిన వ్య‌క్తి స‌మ‌యానికి ఎమ‌ర్జెన్సీ బ‌ట‌న్ నొక్క‌డంతో ఆ వృద్ధ దంప‌తులు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఎస్క‌లేట‌ర్ వంటివి ఉప‌యోగించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని, కంగారు ప‌డ‌కూడ‌ద‌ని అక్క‌డి అధికారులు సూచించారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News