galla jayadev: వచ్చే ఎన్నికల్లో మహేష్ బాబును పిలవను: గల్లా జయదేవ్

  • మహేష్ పై ఒత్తిడి తీసుకురాను
  • గత ఎన్నికల్లో మహేష్ లేకుండానే గెలిచా
  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో గల్లా

2019 ఎన్నికల్లో తన గెలుపు కష్టసాధ్యంగా ఉన్నా సరే మహేష్ బాబును ప్రచారానికి రమ్మని పిలవబోనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మహేష్ పై ఒత్తిడి చేయబోనని చెప్పారు. గత ఎన్నికల్లో మహేష్ రాకుండానే గెలవడం మంచిదనిపిస్తోందని తెలిపారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో గల్లా జయదేవ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తెలుగువారే అయినప్పటికీ తెలుగులో మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది పడుతారు? అనే ప్రశ్నకు సమాధానంగా, తన తెలుగు భాషా సామర్థ్యం గుంటూరు ప్రజలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. తన అక్కయ్య డాక్టర్ రమాదేవితో కలసి జయదేవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేశ్ బాబుకి జయదేవ్ బావ అవుతారన్న విషయం విదితమే!  

galla jayadev
Mahesh Babu
  • Loading...

More Telugu News