jagan: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: జగన్

  • సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలి  
  • పంటలు బాగా పండాలని ఆకాంక్ష

మకర సంక్రాంతి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలియజేసారు. సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కు చెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని అన్నారు. ఈ పండగ అంటేనే రైతులు, పల్లెలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు ప్రతి ఒక్కరికి గుర్తుకురావడం సహజమని జగన్ అన్నారు.

అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగునేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు, సుఖసంతోషాలతో తులతూగాలని, పంటలు బాగా పండి రైతులతో పాటు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తన సందేశంలో జగన్ ఆకాంక్షించారు.

jagan
prajasankalpayatra
ysrcp
sankranthi
  • Loading...

More Telugu News