Widow: 'మా అమ్మకు పెళ్లి' అన్న యువతి... నెట్టింట తిట్లు!

- వితంతు తల్లికి పెళ్లి చేసిన కుమార్తె
- తల్లిని చూసుకోలేక పోయావా? అని విమర్శలు
- తల్లికి సాయంగా ఉండకుండా మరొకరి చేతిలో పెట్టావా? అని తిట్లు
వితంతువు అయిన తన తల్లికి స్వయంగా ఓ వరుడిని చూసి పెళ్లి చేసిందో యువతి. ప్రస్తుతం ఆమెపై ఓ వైపు నుంచి ప్రశంసలు, మరో వైపు నుంచి అత్యధికులు విమర్శలు చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ మహిళకు భర్త చనిపోగా, ఆమెకు మరో వరుడిని చూసిన కుమార్తె, స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించింది.
