Hyderabad: బిచ్చగాడిని చూపిస్తే రూ. 1000... హైదరాబాదీలకు బంపరాఫర్!

  • ప్రస్తుతం బహుమతి రూ. 500
  • రూ. 1000కి పెంచుతున్నట్టు ప్రకటన
  • వెల్లడించిన జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్

హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా బిచ్చగాడు కనిపిస్తే, వెంటనే సమాచారం ఇచ్చి రూ. 1000ని బహుమానంగా పొందవచ్చని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ బంపరాఫర్ ఇచ్చారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం నగరంలో బిచ్చగాళ్లు ఎక్కడా కనిపించడం లేదని, అందువల్లే ప్రస్తుతమున్న రూ. 500 బహుమానాన్ని రూ. 1000కి పెంచామని అన్నారు. మన నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చి చూపించామని అన్న ఆయన, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆనందాశ్రమానికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

Hyderabad
Beggers
Anandashramam
VK Singh
  • Loading...

More Telugu News