Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్

  • కేవలం నాలుగే పదాలతో ఓ ట్వీట్ చేసిన గణేశ్
  • ‘నా బాస్ ని నేను గౌరవిస్తా’  
  • ట్వీట్ తో పాటు పవన్ కల్యాణ్ ఫొటోను పోస్ట్ చేసిన వైనం

ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తరచుగా చెబుతుంటారు. ‘పవన్ కల్యాణ్ నాకు దేవుడితో సమానం’ అంటూ ఆయనపై తనకు ఉన్న వీరాభిమానాన్ని పలు సందర్భాల్లో బండ్ల గణేష్ బయటపెట్టారు. తాజాగా చేసిన ఓ ట్వీట్ లో ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేవలం నాలుగు పదాలతో ఒకే ఒక లైన్ లో చేసిన ఆ ట్వీట్ లో బండ్ల గణేశ్ ఏమన్నారంటే.. ‘నా బాస్ ని నేను గౌరవిస్తా’ అంటూ ‘నమస్కారం’ చేసే ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో, పాటు పవన్ కల్యాణ్ ఫొటోనూ జతపరిచారు. కాగా, బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయమై నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.  

Pawan Kalyan
bandla ganesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News