indigo: విమానం నుంచి ప్రయాణికులను లాగిపడేస్తాం అని బెదిరించి.. మరోసారి వార్తల్లోకెక్కిన ఇండిగో

  • తొలుత విమానం బోర్డింగ్‌కు అంగీకరించారు
  • తరువాత దిగాలని బెదిరించారు- ప్రయాణికుడు
  • మేము మర్యాదగానే చెప్పాం-ఇండిగో
  • పాట్నా విమానాశ్రయంలో ఘటన

ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందిపై త‌రుచూ విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ సంస్థ విమర్శలకు గురైంది. తొలుత విమానం బోర్డింగ్‌కు అంగీకరించి, త‌రువాత ఉన్నట్టుండి విమానాన్ని రద్దు చేశారని, త‌మ‌ని దిగి పొమ్మన్నారని ఇండిగో విమాన‌యాన సంస్థ తీరును తెలుపుతూ ఓ ప్ర‌యాణికుడు చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

 విమానం దిగక‌పోతే భద్రతా సిబ్బందిని పిలిపించి ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగిపడేస్తామ‌ని సిబ్బంది బెదిరించార‌ని మహారాష్ట్రకు చెందిన ప్రసాద్‌ నందూర్‌కర్‌ అనే వ్యక్తి తెలిపారు. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ క్రమంలో త‌మ‌పై వస్తోన్న ఆరోప‌ణ‌ల పట్ల ఇండిగో స్పందిస్తూ... విమానంలో 20 మంది ప్రయాణికులు మినహా అందరూ దిగారని, దిగ‌ని వారిని తామేం బెదిరించలేద‌ని, తాము చాలా మర్యాదగానే చెప్పామని అంటోంది. 

  • Loading...

More Telugu News