Hyderabad: హైదరాబాద్ శివారులో సిలిండర్ల పేలుడు.. బైక్‌పై వెళుతోన్న వ్యక్తికి అంటుకున్న మంటలు.. మృతి

  • మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని చెంగిచర్ల వ‌ద్ద భారీ అగ్ని ప్ర‌మాదం
  • డీజిల్, సిలిండ‌ర్ల లారీల్లో చెలరేగిన మంటలు  
  • భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతోన్న స్థానికులు

హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ పరిధిలోని చెంగిచర్ల వ‌ద్ద డీజిల్, సిలిండ‌ర్ల లారీల్లో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. సిలిండ‌ర్లు పేలుతూ మంట‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో అటుగా వెళుతోన్న ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడికి మంట‌లు అంటుకోవ‌డంతో మృతి చెందిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.         

  • Loading...

More Telugu News