lalu prasad yadav: ఆ జైలులో ఉండడం నాకు ఇష్టం లేదు.. మార్చండి సారూ!: జడ్జితో లాలూ ప్రసాద్ యాదవ్

  • హజారీభాగ్‌లోని ఓపెన్‌ జైల్లో దాణా కుంభకోణం దోషులకి శిక్ష
  • వేరే జైలులో ఉంచాలని కోరిన లాలూ 
  • దుమ్కా జిల్లా ట్రెజరీ కేసు విచారణ సమయంలో జడ్జితో సంభాషణ

దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద‌వ్‌తో పాటు పలువురు హజారీభాగ్‌లోని ఓపెన్‌ జైల్లో శిక్ష అనుభవించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, దుమ్కా జిల్లా ట్రెజరీ కేసు విచారణ సమయంలో లాలూ జడ్జిని ఓ కోరిక కోరారు. తనకు ఆ ఓపెన్‌ జైలులో ఉండడం ఇష్టం లేదని చెప్పారు.

దీనికి జడ్జి స్పందిస్తూ, ఆ జైలులో కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఉండొచ్చని అన్నారు. జడ్జి సమాధానంపై స్పందించిన లాలూ.. ఆ జైలు నక్సలైట్ల కోసం కేటాయించినదని, దయచేసి ఓపెన్‌ జైలు నిబంధనలు చూడాలని జడ్జితో అన్నారు. కాగా, దాణా కుంభకోణం కేసులో దోషులుగా తేలిన వారు పశువులకు దాణా, ఔషధాలను సరఫరా చేయడంలో నిపుణులని, అందుకే డెయిరీ అభివృద్ధికి ఉపయోగపడతారని వారిని ఓపెన్‌ జైలుకు పంపిస్తున్నానని అప్పట్లో తీర్పు సమయంలో జడ్జి చెప్పారు.


  • Loading...

More Telugu News